గత వారం రోజులుగా వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతం చేస్తున్నాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నాయి. శనివారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా అతి భారీ స్థాయిలో వర్షం పడుతోంది. దీంతో నగరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో విద్యుత్ అంతరాయం ఏర్పడితే వినియోగదారులు తమ దృష్టికి తీసుకురావాలని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ జి రఘుమారెడ్డి సూచించారు. ఈ మేరకు 1912 అనే హెల్ప్ లైన్ నంబర్ ను ప్రవేశపెట్టారు. అలాగే విద్యుత్ శాఖ కంట్రోల్ రూం నంబర్లు 73820 72104, 73820 72106, 7382072104, 73820 71574కు ఫోన్ చేయాలని, ఉర్జా మిత్ర యాప్‌లోనూ కంప్లయింట్ చేయొచ్చని తెలిపారు.
అలాగే దిల్సుఖ్నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీ.ఎన్.రెడ్డి, సరూర్‌నగర్, చంపాపేట, మన్సూరాబాద్, సైదాబాద్, మలక్‌పేట, నాగోల్, హబ్సిగూడ, ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, రాయదుర్గం, పాతబస్తీ పరిధిలోని షేక్‌పేట, మదీనా, చార్మినార్, గోల్కొండ, టోలిచౌకి, లంగర్‌హౌజ్, మెహదీపట్నం, కార్వాన్, బహదూర్‌పుర, జూపార్క్, పురానాపూల్ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.