Power Star pawan kalyan, Supreme star Sai Dharam Tej Start Vinodhaya Sitham Remake
mictv telugu

మామ అల్లుళ్ల మల్టీస్టారర్ మూవీ షురూ

February 22, 2023

Power Star pawan kalyan, Supreme star Sai Dharam Tej Start Vinodhaya Sitham Remake

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన షూటింగ్ బుధవారం మొదలైంది. తమిళ్ లో హిట్ అయిన వినోదయ సీతం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ రీమేక్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఈరోజు… షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం అంటూ అఫీషియల్ అప్డేట్ ని ఇచ్చేసింది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ రీమేక్ గ్రాండ్ గా అనౌన్స్ అయ్యింది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాస్తున్నారు. ఇక ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన ఫోటోస్ లో పవన్ కళ్యాణ్-తేజ్ లు హుడీ వేసుకోని స్టైలిష్ గా కనిపించారు. ఫోటోస్ లో త్రివిక్రమ్, తమన్ కూడా ఉన్నారు. కథ ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ రీమేక్ లో ‘టైం’గా నటిస్తుండగా… సాయి ధరమ్ తేజ్ ‘పరసురామ్’ అనే పాత్రలో నటిస్తున్నాడు.

ఈ పాత్రలో తేజ్… చనిపోయిన తర్వాత తన తప్పులని తెలుసుకోని వాటిని సరిదిద్దుకోవడానికి ‘టైం’ దగ్గర మూడు నెలలు సమయం తీసుకోని, తిరిగి తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. ఇక్కడి నుంచి తేజ్ తన తప్పులని ఎలా సరిదిద్దుకున్నాడు, చివరికి చనిపోయిన పరశురామ్ స్వర్గానికి ఎలా వెళ్లాడు అనేది కథ. మూల కథని మాత్రమే తీసుకోని కథనాన్ని మాత్రం తేజ్, పవన్ కళ్యాణ్ లకి సరిపోయేలా.. పవన్ కల్యాణ్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని తెలుగుకు కావాల్సిన మార్పులు, చేర్పులు చేశారట. మరి అనౌన్స్మెంట్ తోనే మెగా అభిమానులని ఖుషీ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి నంబర్స్ ని రాబడుతుందో చూడాలి. ఇక ఈ ప్రాజెక్ట్ విషయమై తేజ్ ట్వీట్ చేస్తూ… “The Best Day” అని కోట్ చేశాడు. తన జీవితానికి గురువు లాంటి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం ఇచ్చినందుకు సముద్రఖనికి బిగ్ థాంక్స్ చెప్పాడు.