ఎక్కడో సుడి ఉంటేకానీ అదృష్టం వరించి 50 లక్షలో, లేదంటే కోటి రూపాయలో లాటరీ తగలదు. అలాంటిది ఓ వ్యక్తికి 6 వేల 100 కోట్ల రూపాయల లాటరీ తగిలిందంటే.. ఎక్కడో మచ్చ వేసుకొని పుట్టాడేమో అనుకుంటారు. వినడానికి, నమ్మడానికి షాకింగ్ గా ఉన్నా.. ఇది పచ్చి నిజం. అమెరికాలోని వాషింగ్టన్ ఓ వ్యక్తికి సోమవారం రాత్రి అదృష్ట దేవత అతని తలుపు తెరిచే వరకూ గట్టిగా కొట్టి ఉంటుంది. కాబట్టే పవర్‌బాల్ వెబ్ సైట్ నుంచి $747 మిలియన్ జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు.
ఒకే టికెట్ మొత్తం ఆరు నంబర్లతో సరిపోలిందని, దీని విలువ 754.6 మిలియన్ డాలర్లు అని లాటరీ అధికారులు చెప్పారు. జాక్‌పాట్‌ను గెలుచుకునే అవకాశాలు 292.2 మిలియన్లలో కేవలం ఒకే ఒక్కరికి మాత్రమే ఉంటుందని చెప్పారు. సోమవారం రాత్రి డ్రా తీయగా సదరు వ్యక్తి నెంబర్స్ 22, 11, 23, 5, 69… పవర్‌బాల్: 7 తో సరిగ్గా మ్యాచ్ అయ్యాయని చెప్పారు. అయితే ఇంత మొత్తం (రూ. 6,100 కోట్లు) ఒకేసారి ఇవ్వడం కుదరదని చెప్పారు. తొలుత కొంతబాగాన్ని లాటరీ విజేతకు అందజేసిన తర్వాత మిగతా మొత్తాన్ని విడతల వారీగా 29 ఏండ్ల పాటు ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఒకేసారి కావాలంటే కేవలం 407.2 మిలియన్ డాలర్లు(3,360 కోట్లు) మాత్రమే ఇస్తామని చెప్పారు.