prabash adhipurush again reshoot
mictv telugu

ఆదిపురుష్‌కు భయం..100 కోట్లతో రీ షూట్..

November 6, 2022

బాహుబలితో దేశమంతటా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి ప్యాన్ ఇండియా చిత్రాలను చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను చేసిన సాహో, రాదేశ్యామ్ సినిమాలు ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయాయి. ఇప్పుడు తాజాగా ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల అట్టహాసంగా రిలీజ్ చేసారు. అయితే దీనిపై విమర్శలు వచ్చాయి. టీజర్‌లో విజువల్ ఎఫెక్ట్స్ బాలేదని..త్రీడి బొమ్మలు సినిమాను పోలి ఉన్నాయంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసారు. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ట్రోల్స్ నడిచాయి. దీనిపై దృష్టిపెట్టి చిత్ర బృందం సంచలనం నిర్ణయం తీసుకొంది. మరో 100 కోట్లు బడ్జెట్ పెట్టి వీఎఫ్ ఎక్స్, సీజీ వర్క్స్ లో తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

తాజాగా తీసుుకున్న చిత్ర బృందం నిర్ణయంతో సినిమా విడుదల మరింత ఆలస్యం కానుంది.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. కానీ, ఇప్పుడు వీఎఫ్ ఎక్స్ తప్పులు సరి చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో సంక్రాంతికి బదులు వేసవిలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. చిత్రం విడుదల వాయిదా పడుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్ర బృందం తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఆదిపురుష్ చిత్రం ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించారు.. సీతాదేవిగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.