సాహోరే ప్రభాస్.. మరో రూ. 3 కోట్లు విరాళం - MicTv.in - Telugu News
mictv telugu

సాహోరే ప్రభాస్.. మరో రూ. 3 కోట్లు విరాళం

March 27, 2020

Prabhas 4 Crore Donation Fight For Corona   

కరోనాపై ఫైట్ చేసేందుకు టాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా సాయం ప్రకటిస్తున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి ప్రకటించిన హీరో ప్రభాస్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రధానమంత్రి సహాయ నిధికి ఏకంగా రూ. 3 కోట్లు విరాళం ఇస్తానని తెలిపారు. దీంతో ఆయన ఇచ్చిన విరాళాలు రూ. 4 కోట్లకు చేరింది. 

లాక్‌డౌన్ కారణంగా రోజువారీ కూలీలు,పేదలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారికి చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. అటువంటి పనుల కోసం అండగా నిలిచేందుకు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ,క్రీడా ప్రముఖులు తవంతు సాయం అందజేశారు.అయితే ప్రభాస్ మాత్రం రెండుసార్లు సాయం ప్రకటించడం విశేషం. 

అల్లు అర్జున్ రూ. 1.25 కోట్లు సాయం : 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా విరాళం ప్రకటించారు. తనవంతుగా రూ. 1.25 కోట్లు అందిస్తానని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఈ డబ్బును ఇస్తానని పేర్కొన్నారు. అందరం కలిసి ఈ మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దీని కారణంగా ఎన్నో జీవితాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు ప్రకటించారు. కాగా ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్, చిరంజీవి తదితర హీరోలు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.