Prabhas Adipurush, Adipurush Teaser trolls
mictv telugu

‘ఆది పురుష్’ చూశాక.. ‘సన్ ఆఫ్ ఇండియా’పై గౌరవం పెరిగింది.. ప్రభాస్‌పై ట్రోలిగ్

October 3, 2022

ప్రభాస్ లాంటి కటౌట్ డేట్స్ ఇస్తే ఇరగదీయాల్సిన దర్శకులు వరుసగా ఇలా తప్పటడుగులు వేయటమేంటో అర్ధం కానీ పరిస్థితి. ‘బాహుబలి’ స్థాయిలో కాకున్నా.. కనీస నాణ్యత లేని కథలతో ప్రభాస్‌తో సినిమాలు తీస్తున్నారు మేకర్స్. ‘సాహో’ కావొచ్చు, ‘రాధేశ్యామ్’ అవ్వొచ్చు ప్రభాస్ అభిమానులని తీవ్రంగా నిరాశపరచాయి. దాంతో డార్లింగ్ నెక్స్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’పై తారస్థాయిలో అంచనాలు పెరిగాయి. అత్యంత భారీ బడ్జెట్, మన ఇతిహాసం రామాయ‌ణం స్ఫూర్తిగా కథాంశం, బాలీవుడ్ మేకర్స్ భారీ గ్రాఫిక్స్‌తో ఆది పురుష్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. దాంతో నిన్న విడుదలైన ఆది పురుష్ టీజర్ క్షణాల్లో వైరల్ అయిపోయింది.

‘భూమి కృంగినా నింగి చీలినా.. వ‌స్తున్నా’, ‘న్యాయం చేతుల్లోనే అన్యాయానికి స‌ర్వ‌నాశ‌నం’, ‘వ‌స్తున్నా.. న్యాయం రెండు పాదాల‌తో నీ ప‌ది త‌ల‌ల అన్యాయాన్ని అణిచివేయ‌డానికి’ అంటూ రావ‌ణుడితో పోరు సాగించ‌డానికి సిద్ధ‌మైన‌ట్లుగా ప్ర‌భాస్ చెప్పిన డైలాగ్స్ గూస్‌బంబ్స్ తెప్పించేలా ఉన్నాయి. అయితే ఈ మూవీ టీజర్ మేజర్ ఆడియన్స్‌కి నచ్చినా.. కొంతమంది అంచనాలని అయితే అందుకోలేక పోయిందని తెలుస్తుంది. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ దసరా కానుకగా విడుదల చేశారు. కానీ భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ పెట్టుకున్న కొందరు ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అయ్యారు. దీనికి ప్రధాన కారణం ప్రభాస్, సైఫ్ అలీఖాన్ వంటి భారీ ఆర్టిస్టులని పెట్టుకుని లైవ్ యానిమేటెడ్ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో ‘ఆది పురుష్’ సినిమాను తెరకెక్కించటమే. ఈ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీలో నటీనటులు సహజంగా కనిపించటం లేదని, దాంతో ఆడియన్స్ పాత్రలకి కనెక్ట్ కాలేదని క్రిటిక్స్ చెప్తున్న మాట. ఇంకేముంది బొక్కల కోసం కాచుకూర్చునే ట్రోలర్స్‌కి మెటీరియల్ దొరికేసింది.

ముఖ్యంగా యాంటి ఫ్యాన్స్ ‘ఆది పురుష్’ సినిమాపై అప్పుడే ట్రోలింగ్స్ మొద‌లు పెట్టేశారు. అస‌లే మ‌న మీద గుర్రుగా ఉన్న త‌మిళ తంబీలు, బాలీవుడ్ జ‌నాలు ఇంకాస్త గ‌ట్టిగానే సినిమాను ట్రోల్ చేస్తున్నారు. చిన్నపిల్లల యానిమేష‌న్ సినిమాను చూస్తున్న‌ట్టుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ షూట్ చేసే గ్రీన్ మ్యాట్‌లో సినిమాను తీసేసి.. దానికి ఏదేదో టెక్నాల‌జీ అంటూ కొత్త పేర్లు చెప్తున్నారని ట్రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాను సూప‌ర్ స్టార్ రజినీకాంత్ అట్టర్ ఫ్లాప్ మూవీ ‘కొచ్చడ‌యాన్‌’ (విక్రమసింహ)తో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఈ సినిమా టీజర్ చూశాక ‘సన్ ఆఫ్ ఇండియా’ గ్రాఫిక్స్‌పై గౌరవం పెరిగిందని.. ‘ఆచార్య’ సినిమాపై అభిమానం రెట్టింపు అయిందని ఎవరికితోచిన విధంగా వారు ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేమైనా ‘ఆదిపురుష్’ గ్రాఫిక్స్ మరింత నాణ్యంగా ఉంటే బాగుండు అన్న విమర్శలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.