ప్రభాస్, అనుష్కల పెళ్లి అయ్యాకే.. నా పెళ్లి: అడివి శేష్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్, అనుష్కల పెళ్లి అయ్యాకే.. నా పెళ్లి: అడివి శేష్

May 21, 2022

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. పెళ్లి చేసుకోకుండా హీరోలు, హారోయిన్స్ ఎంతమంది బ్యాచిలర్ లైఫ్‌ను గడుపుతున్నారు అని అటు సోషల్ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో తెగ చర్చించుకుంటున్నారు. ఈ చర్చకు ప్రధాన కారణం.. ‘మేజర్’ సినిమా ప్రమోషన్‌లో ఓ యాంకర్ హీరో అడివి శేష్‌ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నతో మొదలైంది. తాజాగా హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీ పెళ్లి చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘మేజర్’ చిత్రం ప్రమోషన్స్ కోసం యువ హీరో అడివి శేష్ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రమోషన్‌లో భాగంగా అడివి శేష్‌కు పెళ్లి ప్రశ్న ఎదురైంది.

దాంతో అడివి శేష్ స్పందిస్తూ, ఆసక్తికర సమాధానాన్ని చెప్పాడు. ”ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. నా స్నేహితులు ప్రభాస్, అనుష్క కూడా పెళ్లి చేసుకోలేదు. వాళ్లిద్దరి పెళ్లి అయిపోయిన తర్వాత నేను కూడా పెళ్లి చేసుకుంటా. ఇటీవలే మరో స్నేహితులు ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీలు చేసుకున్నారు. నాది కూడా అవుతుంది. కానీ ఫస్ట్ ప్రభాస్, అనుష్కల పెళ్లి కావాలి” అని అన్నాడు. దాంతో సోషల్ మీడియాలో మరోసారి ప్రభాస్, అనుష్కల పెళ్లి గురించి నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

మరోపక్క బాహుబలి సినిమా ప్రమోషన్‌ సమయంలో పలువురు యాంకర్లు ప్రభాస్, అనుష్క పెళ్లి గురించి ప్రశ్నలు మీద ప్రశ్నలు అడిగారు. దానికి ఇరువురు సమాధానాలు చెప్తూ..’మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్, మా మధ్య అంతకు మించి ఎలాంటి రిలేషన్ లేదు” అని అన్నారు. ప్రభాస్, అనుష్కల పెళ్లి విషయంలో ప్రభాష్ కుటుంబ సభ్యులు స్పందిస్తూ.. ‘వారి మధ్య స్నేహమే తప్ప, పెళ్లి చేసుకునేంతా రిలేషన్ లేదు’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో శేష్ వ్యాఖ్యలతో ప్రభాస్, అనుష్కల గురించి మరోసారి చర్చ విపరీతంగా జరుగుతోంది.