అభిమానానికి సలాం.. మోకాళ్లపై ఆరడుల ప్రభాస్ - MicTv.in - Telugu News
mictv telugu

అభిమానానికి సలాం.. మోకాళ్లపై ఆరడుల ప్రభాస్

March 29, 2018

ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఒకరు అభిమానిస్తే వందరెట్లు తిరిగి అభిమానించాలి. బాహుబలి ప్రభాస్‌ది అదే తీరు. తను ప్రపంచమంతా తెలిసిన పెద్ద స్టార్ అయినా అదేమీ పట్టించుకోకుండా స్నేహితులతో, అభిమానులతో కలివిడిగా ఉంటాడు ఈ ఆరడుగుల అందగాడు. తాజాగా ప్రభాస్ ఓ అభిమానితో దిగిన పొటోలు జనాన్ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

 

వికలాంగుడైన ఒక అభిమాని ఇటీవల ప్రభాస్‌ను కలుసుకున్నాడు. ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసుకుని, అతికష్టమ్మీద అక్కడికి చేరుకున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న హీరో హృదయం చలించిపోయింది. ఆ అభిమానిని కౌగిలించుకుని, ముచ్చట్లు పెట్టుకున్నాడు. ఇద్దరు కలసి సెల్ఫీ ఫోటో దిగుదాం అని అభిమాని కోరాడు. అంతే.. బాగా ఎత్తున్న ప్రభాస్ చప్పున మోకాలిపై కూర్చుని సెల్ఫీ దిగాడు. కాస్త ఇబ్బందిగా ఉన్నా, ముఖంలో అదేమీ కనిపించకుండా నిండుగా నవ్వుతూ పోజిచ్చారు. దీంతో అభిమాని ఉప్పొంగిపోయాడు.