prabhas fans angry on actress trisha over her post on varsham movie re release
mictv telugu

వర్షం వివాదం.. త్రిషపై ప్రభాస్ టీమ్ సీరియస్

November 14, 2022

ప్రభాస్ రియల్ పాన్ ఇండియా హీరో. బాలీవుడ్ లో అత్యధికంగా మార్కెట్ ఉన్న సౌత్ హీరో. దానికి తగ్గట్టే డార్లింగ్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. నిత్యం ప్రభాస్ వార్తలతో నడిచే ఛానెల్స్ కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ప్రభాస్ అప్డేట్స్ తో పాటు క్రేజ్ ని రెట్టింపు చేసే వైరల్ వీడియోస్ ని సైతం కొందరు ఫ్యాన్స్ సొంత ఖర్చులతో ప్రమోట్ చేస్తుంటారు. వీరంతా ప్రభాస్ కి వెన్నంటే ఉంటారు. సోషల్ మీడియాలో డార్లింగ్ పై ఈగ వాలనివ్వరు. పాజిటీవ్ కామెంట్స్ చేస్తే ఎంత వైరల్ చేస్తారో.. ప్రభాస్ కి నెగిటీవ్ అయితే ఏకిపారేస్తారు. తాజాగా చెన్నై బ్యూటీ త్రిషకి సైతం ఈ ట్రోలింగ్ రుచి చూపిస్తున్నారు డార్లింగ్ ఫాన్స్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. స్టార్ హీరోల పుట్టిన రోజుకి వారి బ్లాక్ బస్టర్ మూవీలను థియేట్రికల్ రీ రిలీజ్ తో వేడుకలు చేస్తున్నారు. మహేశ్ ‘పోకిరి’తో ఈ మేనియా మొదలవ్వగా.. తాజాగా 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ‘బిల్లా’ రీ రిలీజ్ చేశారు. దానికి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక డార్లింగ్ హీరో ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ‘వర్షం’ 4k ప్రింట్ ని మరోసారి థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా త్రిష స్పందించింది.

తెలుగులో తన తొలిచిత్రం వర్షంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది త్రిష. ఆ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఫ్యాన్స్ కి కృతఙ్ఞతలు చెప్తూనే త్రిష చేసిన ఓ పని మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫుల్ కోపం తెప్పించింది. తాను రాసిన నోట్ లో ప్రభాస్ పేరెత్తక పోవటంపై డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘ నేను నటించిన తోలి చిత్రం వర్షం రీ రిలీజ్ అయినట్టు తెలిసింది. 18ఏళ్ళ తరువాత థియేటర్ లో మళ్ళీ విడుదలవ్వటం చాలా ఆనందంగా ఉంది. మంచి సినిమాలు ఎప్పటికి ప్రేక్షకుల మనసు నుండి వెళ్లిపోవు అన్నదానికి ఇదొక ఉదాహరణ. మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీకు ఏమిచ్చి రుణం తీర్చుకొగలను. ఈ వీడియో చూసాక నా మనసు ఆనందంతో నిండిపోయింది’ అంటూ త్రిష పెట్టిన వీడియో పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అంతపెద్ద నోట్ లో ప్రభాస్ గురించి ఒక్క ముక్క చెప్పకపోవటం ఏంటీ.. సొంత డబ్బా కొట్టుకోకుండా.. తనకి తోలి హిట్ ఇచ్చిన ప్రభాస్ గురించి రెండు మంచి మాటలు చెప్తే మీ సొమ్ము ఏమైనా పోతుందా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ త్రిషని ట్రోల్ చేస్తున్నారు. ఇకపై త్రిష సినిమాలని మనం టార్గెట్ చేయాలంటూ మరికొంతమంది డార్లింగ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.