ప్రభాస్ బర్త్ ‌డే వేడుకల్లో విషాదం.. ఇద్దరు ఫ్యాన్స్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ బర్త్ ‌డే వేడుకల్లో విషాదం.. ఇద్దరు ఫ్యాన్స్ మృతి

October 23, 2020

bgcb

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినం వేడుకల్లో విషాదం చోట చేసుకుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ప్లెక్సీ కడుతూ.. ఇద్దరు అభిమానులు మరణించారు. కరెంట్ షాక్ కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ సంఘటన జరిగింది. మరో ఆరుగురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. వరుస ప్రమాదాలతో అభిమానులు విచారంలో మునిగిపోయారు. 

గుంటూరు జిల్లా యుద్దనపూడి మండలం పూనూరులో నలుగురు అభిమానులు ప్లెక్సీ ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఆ సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయాల పాలయ్యారు. వెంటనే వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఎల్.ఎన్ పురంలో కూడా ఇలాగే జరిగింది. అక్కడ కూడా ఫ్లెక్సీకి విద్యుత్ తీగలు తాకడంతో ఓ వ్యక్తి చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడు గండికోట దుర్గాప్రసాద్‌గా గుర్తించారు. కాగా, అభిమాన హీరో వేడుకల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే సమయంలో ప్రతిసారి ఏదో ఒక చోట ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా మంది జాగ్రత్తలు పాటించడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.