prabhas fans Vs allu Arjun Fans War Over Prabhas Wig
mictv telugu

పెను దుమారంగా ప్రభాస్ విగ్గు .. బన్నీ డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర ఘర్షణ

December 22, 2022

truth behind prabhas having wig revealed

ఒకప్పుడంటే థియేటర్ల దేగ్గరో బహిరంగాగంనో ఫ్యాన్స్ గొడవలు ఉండేవి. సోషల్ మీడియా ఎంట్రీ తరువాత ట్రోలింగ్ అనే వెపన్ తో కొట్టుకుంటున్నారు హీరోల అభిమానులు. బయటికి హీరోలంతా ఒకటే అని చెప్తున్నా ఫ్యాన్స్ మధ్య మాత్రం విభేదాలు ఆగటం లేదు.

ఏ హీరో ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతాడా అని కాచుకుని ఉంటారు యాంటీ ఫ్యాన్స్. టంగ్ స్లిప్ అయితే మంచు హీరోలకు ఎలాగైతే మోత మోగిస్తారో.. అలానే ఇప్పుడు స్టార్ హీరోల పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకుల కంటే అభిమానులకి హీరోల పర్సనల్ లైఫ్ పై ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. వారు తినే ఫుడ్, వేసుకునే బట్టలు, గ్యాడ్జెట్స్, వాటి ధర ఇలా ప్రతిదాన్ని తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. ఇలానే హీరోల హెయిర్ స్టైల్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. బన్నీ హెయిర్ కి సపరేట్ క్రేజ్ ఉంటుంది. అయితే బన్నీ హెయిర్ స్టైల్ ని అభిమానించే అల్లు ఫ్యాన్స్ కన్ను ఇప్పుడు ప్రభాస్ పై పడింది. గత కొద్దిరోజుల నుండి హీరోల విగ్గుల సీక్రెట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు, వెంకటేష్ లు ధరించే విగ్గులపై వారి మేకప్ మెన్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్న క్రమంలో ఇప్పుడు ప్రభాస్ హెయిర్ కూడా ఒరిజినల్ కాదని.. విగ్ వాడతాడని అల్లు అర్జున్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో ప్రూఫ్ తో సహా వీడియో షేర్ చేశాడు.

‘ఇన్ని రోజులు నీ బొచ్చు ఒరిజినల్ అనుకున్నా.. నీది కూడా విగ్గేనా..’ అంటూ బన్నీ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్ ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తేప్పిస్తున్నాయ్. మూతి, ముక్కులకు సర్జరీ చేయించుకుని స్టార్ అయిన హీరో ఫ్యాన్స్ కూడా మా బాహుబలిని కామెంట్ చేసే రేంజికి ఎదిగారా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఒక ఇంటర్వ్యూ కి ముందు ప్రభాస్ మేకప్ మెన్ హెయిర్ సెట్ చేస్తున్న వీడియో సాక్షిగా ఇప్పుడు బన్నీ, డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. మీ హీరోది విగ్ అంటే, మీ హీరోది సర్జరీ ఫెస్ అంటూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు . అయితే ప్రభాస్ వీడియోలో ఒరిజినల్ జుట్టుని స్టైల్ చేస్తున్నట్లు కాకుండా.. చాలా డెలికేట్ గా పట్టుకుని ఆయన జుట్టుని సరి చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఇలాంటి కామెంట్లు తెరమీదకు వస్తున్నాయి. అయితే ఎవ్వరికైనా స్ట్రెస్ కారణంగా జుట్టు రాలటం సహజం. ఇలాంటి పర్సనల్ విషయాలు మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ కామెంట్లు చేయడం వల్ల ఫ్యాన్ వార్స్ మరింత పెరగడం తప్ప మరొక ఉపయోగం లేదని చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

దేశం గర్వించే కోహ్లీ భార్య.. నడిరోడ్డుపై ఇంత దిగజారడం ఏంటీ ?

మెగాస్టార్ కి మోసం.. పదేళ్లకు నోరు విప్పిన నయనతార..!

పేరు మార్చుకున్న సందీప్ కిషన్.. ఆమెతో పెండ్లి కోసమేనా?