ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం.. త్వరపడండి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం.. త్వరపడండి

April 22, 2022

03

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించబోతున్న సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్వాగ‌తం ప‌లుకుతోంది. అయితే, మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉండి, పార్కౌట్ ప్లేయ‌ర్స్, న్యూ ఏజ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ వంటివి వ‌చ్చిన వారు అర్హులని నిర్మాణ సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్నవారు [email protected] అడ్ర‌స్‌కి త‌మ వివ‌రాలు పంపాల‌ని కోరింది.

ఇంత‌కు ముందు కూడా ప‌లు విభాగాల్లో వైజ‌యంతీ మూవీస్ ఆస‌క్తి ఉన్న వారిని ఈ సినిమాలో భాగ‌స్వాములు అయ్యేందుకు ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. వైజ‌యంతి మూవీస్‌కి ఇది 50వ సినిమా. టాలెంట్ ఉండి అవ‌కాశాల కోసం ఎదురు చూస్తోన్న వారికి ఇందులో అవ‌కాశం క‌ల్పిస్తోంది. కావున మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉండి, పార్కౌట్ ప్లేయ‌ర్స్, న్యూ ఏజ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్‌గా అనుభవం ఉన్నావారు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిత్రబృందం కోరింది.

మరోపక్క బహుబలి-1, బహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు భారీగా కలెక్షన్లు వసూలు చేసిన అంతగా విజయం సాధించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్నా, త్వరలోనే సెట్‌పైకి వెళ్లబోతున్నా సినిమాలను ఈసారి కచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొట్టే విధంగా యాక్షన్ సీన్స్‌ను నిర్మాణ సంస్థలు ప్లాన్స్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తూ, ముందుకు వెళ్తున్నాయి.