ప్రభాస్‌కి సిగ్గెక్కువ.. బుట్టబొమ్మ కామెంట్స్ వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్‌కి సిగ్గెక్కువ.. బుట్టబొమ్మ కామెంట్స్ వైరల్

March 7, 2022

praba

తాను నటించిన అందరి హీరోలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కి సిగ్గెక్కువ అని పూజాహెగ్డే తెలిపారు. ఆయనతో కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుదలవుతున్న నేపథ్యంలో జరుగుతున్న ప్రమోషన్ కార్యక్రమంలో పూజా పై కామెంట్ చేశారు. సిగ్గుతో పాటు ఫన్నీగా, జోవియల్‌గా ఉంటాడని ప్రశంసించింది. ఇక తాను పనిచేసిన వారిలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హై ఎనర్జిటిక్ పర్సన్ అనీ, భాషపై పట్టు ఉండడం వల్ల ఎలాంటి సన్నివేశాన్నైనా ఒకే టేక్‌లో పూర్తి చేస్తాడని వివరించింది. డీజే సినిమాలో కలిసి నటించిన అల్లు అర్జున్ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటాడని చెప్పింది. ఇదిలా ఉండగా, భారీ బడ్జెట్‌తో నిర్మించిన రాధేశ్యామ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలో నటించారు. ప్రభాస్ విక్రమాదిత్యగా, పూజా హెగ్డే ప్రేరణ పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసింది.

ppp