టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో, బాహుబలి ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఎప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటి వాడవుతాడా? అని వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోలో ఇదే ప్రశ్న అడిగితే సమాధానం దాటవేశాడు. కానీ రాంచరణ్ మాత్రం త్వరలో గుడ్ న్యూస్ వింటామని హింట్ ఇచ్చినా అమ్మాయి ఎవరు అనేది రివీల్ చేయలేదు. ముందుగా స్వీటీ అనుష్కతో ప్రేమ వ్యవహారం ఉందని పెళ్లి కూడా చేసుకుంటారని రూమర్లు గట్టిగా వినిపించాయి.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023
కానీ అది సాధ్యపడలేదు. ఈ మధ్య కొత్తగా ఆదిపురుష్ సినిమాలో జంటగా నటించిన బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ పేరు బలంగా వినిపిస్తోంది. బాలీవుడ్ టాక్ షోలో కృతి సనన్‌తో పాల్గొన్న వరుణ్ ధావన్ వీరి గురించి ఓ హింట్ ఇచ్చాడు. ‘ఈమె దీపికా పదుకొనేతో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న ఓ పెద్ద హీరోతో ప్రేమలో ఉంది’ అని దాని సారాంశం. దీపికాతో ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తుంది ప్రభాసే కాబట్టి వరుణ్ చెప్పిన ఆ పెద్ద హీరో ఆయనేనని ఎవరికి వారు విశ్లేషించుకున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన ట్వీట్ రెండు ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. ‘బ్రేకింగ్ న్యూస్. కృతి సనన్ – ప్రభాస్‌ల ఎంగేజ్‌మెంట్ వచ్చే వారం మాల్దీవుల్లో జరుగబోతోంది’ అని ట్వీట్ చేశాడు. దీంతో ప్రభాస్ పెళ్లి విషయం మరింత వైరల్‌గా మారింది. దీనిపై ప్రభాస్ అభిమానులు కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నీకెలా తెలుసు? నిన్నేమైనా కల్యాణమండపం బుక్ చేయమన్నారా? లైకుల కోసం ఏది పడితే అది రాయకు? అంటూ ఏకి పారేస్తున్నారు. ఈ పెళ్లి వార్తలపై ప్రభాస్, కృతిసనన్‌లలో ఎవరైనా ఒకరు స్పందించి క్లారిటీ ఇస్తే గానీ ఇందులో ఎంత నిజముందో తెలియదు.