టాలీవుడ్ మోస్ట్ ఎలీజబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై రోజుకో వార్త వైరల్ అవుతోంది. ఈ అరడుగుల బుల్లెట్ కు జోడిగా రావాల్సిన అమ్మాయి ఎక్కడుందో గానీ నెటిజన్లు తమ క్రియేటివిటీ అంతా ఉపయోగించి రోజుకో పోస్టింగ్ పెట్టేస్తున్నారు.రాశి సిమెంట్ చైర్మన్ మానవరాలిని చేసుకోబోతున్నాడని లేటెస్ట్ గా వార్త చక్కర్లు కొడుతోంది.
కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్ లోనూ బాహుబాలి కోసం ఐదేళ్లు త్యాగం చేసిన ప్రభాస్.. చివరికి తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఐదేళ్లలో ప్రభాస్‌కు ఏకంగా ఆరు వేల పెళ్లి ప్రతిపాదనలు వచ్చాయట. బాహుబలి కోసం సైన్ చేసినపుడే.. ఈ ఐదేళ్లూ పెళ్లికి దూరంగా ఉండాలని ప్రభాస్ డిసైడయ్యాడు. దీంతో ఇన్ని వేల ప్రతిపాదనలు వచ్చినా అతను మాత్రం దేనికీ ఓకే అనలేదు. ఇప్పుడు బాహుబలి సూపర్ సక్సెస్ తో ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి పీటలెక్కే అవకాశం ఉన్నట్లు అతని పెదనాన్న కృష్ణంరాజు ఇంతకుముందే చెప్పారు. దీంతో ప్రభాస్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది.
డార్లింగ్ మ్యారేజ్ పై ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. వీటిని హీరో ప్రభాస్ తిరస్కరించాడు. ఈమధ్యే ప్రభాస్.. అనుష్కని వివాహం చేసుకోనున్నాడనే న్యూస్ వైరల్ అయింది. పెళ్లికి ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలని అనుష్క పూజలు చేసిందని రూమర్స్ వచ్చాయి. ఎన్నో పుకార్ల మధ్య ఇప్పుడు మరో రూమర్ చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ సిమెంట్ రంగంలో బాగా పేరు తెచ్చుకున్న రాశి సిమెంట్ చైర్మన్ మానవరాలితో ఏడడుగులు వేసేందుకు సిద్దమయ్యాడని టాక్. ప్రస్తుతం వీరి పెళ్లి విషయంపై ఇరు కుటుంబాల సభ్యులు చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే ఈ విషయం పై ప్రకటన చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో ప్రభాస్ చెబితే కానీ సస్పెన్స్ కు తెరపడదు..