prabhas may not take any remuneration for raja deluxe, movies
mictv telugu

డబ్బులు తీసుకోకుండా మారుతి సినిమాలో యాక్ట్ చేస్తున్న ప్రభాస్?

February 15, 2023

prabhas may not take any remuneration for raja deluxe

బాహుబలి తరవాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఒక్క తెలుగు వాళ్ళే కాకుండా మొత్తం దేశం అంతా ప్రభాస్ కి ఫ్యాన్స్ అయిపోయారు.అతను కూడా అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.ప్రభాస్ రాబోయే సినిమాల జాబితాలో చాలా ప్రాజెక్టులే ఉన్నాయి.అయితే ఏది ముందు వస్తుంది అన్నది మాత్రం ఇంకా తెలియదు. రీసెంట్ గా ఓం రౌత్ డైరక్షన్ లో వస్తున్న ఆది పురుష్ అయితే రిలీజ్ కు సిద్ధం అయింది. దీని ట్రైలర్ కూడా విడుదల చేశారు. తెలుగులో అయితే రాజా డీలక్స్ వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ ఇది. దీని గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది కూడా.

రాజా డీలక్స్ సినిమాకు ప్రభాస్ ఎలాంటి పారితోషికం తీసుకోవడం లేదని సమాచారం. ఇది లో-బడ్జెట్ సినిమా కాబట్టి.. బడ్జెట్‌ను అదుపులో ఉంచడానికి ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, ఈ సినిమా తెలుగు ఆడియన్స్ కోసం ప్రభాస్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీలతో కాస్త నిరుత్సాహంతో ఉన్న ప్రభాస్ డైరెక్ట్ గా తెలుగు అభిమానులకు ఈ సినిమాతో వినోదం పంచాలని అనుకుంటున్నారుట. హారర్ కామెడీ జానర్‌లో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. ప్రస్తుతానికి పారితోషికం తీసుకోకపోయినా రేపు సినిమా విడుదలైన తరవాత వచ్చే లాభాల్లో షేర్‌ను ప్రభాస్ తీసుకుంటారని అంటున్నారు.

బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ రెమ్యునరేషన్ బాగా పెరిగింది. ఇండియాలో ఎక్కువ పారితోషికం తీసుకుంటోన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. అయితే, ఆయన రెమ్యూనరేషన్‌పై రకరకాల వాదనలు ఉన్నాయి. ఒక సినిమాకు రూ.50 కోట్ల మేర తీసుకుంటారని కొందరు అంటే.. ఇప్పటికే ఆయన రూ.100 కోట్ల మార్కును దాటేశారని మరికొందరు అంటారు.దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.ఏ హీరో తాను ఇంత తీసుకుంటున్నా అని బమిరంగగా చెప్పడు కూడా.

ఇక ప్రభాస్ రాబోయే సినిమాల జాబితా విషయానికి వస్తే.. ‘రాజా డీలక్స్’ కాకుండా వరుసగా పాన్ ఇండియా మూవీలు ఉన్నాయి. నేషనల్ అవార్డు గ్రహీత ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ప్రభాస్ పూర్తి చేశారు. ఇది 3డి టెక్నాలజీ, మోషన్ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో సీజీ వర్క్‌కే ఎక్కువ సమయం పడుతోంది. ఈ ఏడాది ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

అలాగే, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీని వాడుతూ తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘సలార్’. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ఇక, వైజయంతీ మూవీస్ లో రూ.500 కోట్ల బడ్జెట్‌తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె నటిస్తున్నారు. వీటితో పాటు ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కూడా ప్రభాస్ పనిచేసే అవకాశం ఉంది.