ప్రభాస్ కొత్త పోస్టర్ కూడా కాపీనే! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ కొత్త పోస్టర్ కూడా కాపీనే!

October 20, 2020

Prabhas movie new poster is also being copied

ఇది సోషల్ మీడియా కాలం. కాపీ కొట్టి సినిమాలు తీసినా, సన్నివేశాలు వాడుకున్నా నెటిజన్లు ఇట్టే పట్టేస్తారు. హాలీవుడ్ సినిమాలే కదా చక్కగా కాపీ పేస్ట్ చేస్తే ఇక్కడ ఎవరు గుర్తుపడతారులే? అనుకునే అవకాశం లేదు. నవలలను, కథలను కాపీ కొట్టి పాలిష్ చేసి ఎటువంటి అనుమానం రాదన్నట్టు సినిమాలు తీసినా ఇట్టే కనిపెడుతున్నారు. తాజాగా 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ పోస్టర్ మీద అలాంటి రచ్చే రేగింది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా వస్తోన్న ఈ సినిమాపై నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం నుంచి ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో మోషన్ పోస్టర్ విడుదల చేస్తున్నామని చిత్రయూనిట్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్ కూడా కాపీనే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పోస్టర్‌లో ఓ రైలు నుంచి దట్టమైన పొగ వస్తున్నట్టు చూపించారు. ఇప్పుడు ఆ పోస్టర్‌కు సంబంధించి అసలు ఫోటో అంటూ నెటిజన్లు సేమ్ ఫోటోను షేర్ చేస్తున్నారు. రెండిటినీ పక్కపక్కన పెట్టి ‘రాధే శ్యామ్’ పోస్టర్ కాపీ అంటున్నారు. అయితే దీనిపై చిత్రయూనిట్ ఇంకా స్పందించలేదు. 

ఇదిలావుండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను ఇటీవలే చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ పోస్టర్ కాపీ అంటూ అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. బెల్లకొండ శ్రీనివాస్ – పూజాహెగ్డే ‘సాక్ష్యం’ పోస్టర్, వరుణ్ తేజ్ – ప్రజ్ఞా జైస్వాల్ ‘కంచె’ పోస్టర్, రణవీర్ సింగ్ – దీపికా పదుకొనే ‘రామ్ లీల’ సినిమా పోస్టర్లతో ‘రాధే శ్యామ్’ ఫస్ట్‌లుక్‌ని పోల్చారు. మీమ్స్ తయారుచేసి వదిలారు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.