Prabhas New Movie Look Leaked With director Maruthi
mictv telugu

మారుతి సినిమాలో ప్రభాస్ లుక్ ఇదే… షూటింగ్ ఫోటో లీక్

December 25, 2022

Prabhas joins the sets of Maruthi's film; see leaked pic

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసాడు. ప్రస్తుతం 22వ సినిమా చేస్తున్న ప్రభాస్.. అప్పుడే 25వ సినిమాను కూడా కన్ఫర్మ్ చేసాడు. మైల్ స్టోన్ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయబోతున్నాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఖరారు చేసారు. ఇదిలా ఉండగానే తాజాగా మారుతి సినిమాకు సైన్ చేసాడు ప్రభాస్.

కొన్నేళ్లుగా కేవలం యాక్షన్ డ్రామాలతోనే ప్రయాణం చేస్తున్న ప్రభాస్.. చాలా రోజుల తర్వాత ఎంటర్‌టైన్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో సినిమా అసలు ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఎట్టకేలకు వీళ్ల కాంబినేషన్‌ సెట్ అయింది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో మళ్లీ పాత ప్రభాస్ ని చూపిస్తానని తెలిపాడు మారుతి.ఈ ఫోటో చూస్తే వింటేజ్ ప్రభాస్ గుర్తు రాక మానడు. ఈ పిక్ లో ప్రభాస్ పాత లుక్‌లో కనిపిస్తున్నాడు దీంతో ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లీకైన ఫోటోలో ప్రభాస్‌, మారుతి పక్క పక్కనే కూర్చున్నారు. ప్రభాస్‌ లుక్‌ కూడా కొత్తగా ఉంది. ఈ ఫోటోతో డార్లింగ్‌ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. వింటేజ్‌ ప్రభాస్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు పెట్టినట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తాత-మనవళ్ల కథతో ఈ సినిమా రూపొందనుందని ప్రచారం. తాతగా బాలీవుడ్‌ యాక్టర్‌ సంజయ్‌దత్‌ నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి : 

‘చలపతిరావు గారు మా కుటుంబ సభ్యుడు’- నందమూరి బాలకృష్ణ

సినిమా సెలబ్రిటీల బండారం బయటపెడతా : నటి వార్నింగ్

2022 బాలీవుడ్ టాప్ 10 చిత్రాలు..!