సాహో రివ్యూ : ఫ్యాన్స్ కోసం మాత్రమే  - MicTv.in - Telugu News
mictv telugu

సాహో రివ్యూ : ఫ్యాన్స్ కోసం మాత్రమే 

August 30, 2019

Prabhas New Movie Saaho Review

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ పభాస్‌పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగానే ప్రభాస్ తన తర్వాత మూవీని సిద్ధం చేసుకున్నాడు. దర్శకుడు సుజిత్‌తో కలిసి భారీ యాక్షన్‌ సన్నివేశాలతో ‘సాహో’ సినిమా తెరకెక్కించారు. రూ. 300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. సాహో ట్రైలర్ చూశాక ఆయన అభిమానులు సినిమా ఏ రేంజ్‌లో థ్రిల్లింగ్ ఇస్తుందో అని భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లారు. మరి రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ సినిమా వారి అంచనాలను అందుకుందా.? అభిమానులను సుజీత్ మెప్పించాడా ఇప్పుడు చూద్దాం.

నటీ నటులు 

హీరో :  ప్రభాస్

హీరోయిన్ : శ్రద్ధా కపూర్

ఇతర నటులు : మురళి శర్మ, వెన్నెల కిశోర్, జాకీష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

కథ, దర్శకత్వం : సుజీత్

నిర్మాణం : యూవీ క్రికేషన్స్

 

కథ : 

కరుడు గట్టిన గ్యాంగ్‌స్టర్‌ తనకు అడ్డుగా ‘వాజీ’ సిటీని ఏర్పాటు చేసుకుంటాడు. అక్కడి నుంచే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ అలజడులు జరగాలన్నా రాయ్ (జాకీ ష్రాఫ్) ఆదేశాలతోనే నడుస్తుంది. గ్యాంగ్ స్టర్ అయిన రాయ్ ఓ కారు ప్రమాదంలో మరణిస్తాడు. ఇదే సమయంలో ముంబైలో రూ. 2 వేల కోట్ల చోరీ జరుగుతుంది. రాయ్ స్థానంలో  అతని కొడుకు జాకీ(అరుణ్ విజయ్) వారసుడిగా రాయ్ క్రైమ్ సామాజ్యంలోకి అడుగుపెడతాడు. 2 వేల కోట్ల దోపిడీ కేసును ఛేదించేందుకు పోలీస్ ఆఫీసర్ అశోక్ చక్రవర్తి ( ప్రభాస్ ) ఎంట్రీ ఇస్తాడు.  శ్రద్దా కపూర్‌తో కలిసి ఆ ఆపరేషన్‌లో పాల్గొంటాడు. ఈ విచారణలో అనేక మలుపులు బయటకు వస్తాయి. అశోక్ చక్రవర్తి స్థానంలోకి ‘సాహో’ రావడం. 2వేల కోట్ల దోపిడీ కాస్త రూ. 2 లక్షల కోట్లకు చేరడం జరుగుతాయి. దీని వెనక ఉన్నఅసలు కథ ఏంటీ.. అశోక్ చక్రవర్తి కేసును ఛేదించాాడా..? అనేది అసలు కథ.

విశ్లేషణ : 

యాక్షన్ సినిమా అంటూ ముందు నుంచి చిత్ర యూనిట్ హైప్ పెంచింది. అందుకు తగ్గట్టుగానే యాక్షన్ సన్నివేశాలు, చేజింగులు,సస్పెన్స్‌తో సినిమాను సుజీత్ తెరకెక్కించాడు. యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నా కథను బలంగా చూపించలేకపోయాడు. ఇదివరకు చాలా తెలుగు సినిమాలు చూపించినట్టుగానే ఈ సినిమాలోనూ ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. కానీ తర్వాత ట్విస్ట్ ఏంటనేది మాత్రం ప్రేక్షకుడికి ముందుగానే పసిగట్టే అవకాశాన్ని ఇచ్చాడు.  ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో మెప్పించాడు. స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం సుజీత్ తడబడినట్టుగా కనిపిస్తుంది. సినిమా అంచనాలకు తగ్గట్టుగా స్క్రీన్‌ప్లేను ఫ్రేం చేసుకోలేదు. వెన్నెల కిశోర్ లాంటి కమెడియన్ ఉన్నా ఇందులో దానికి పెద్దగా చోటు లేదు. సినిమా అంతా సీరియస్‌గా సాగుతుంది. ప్రభాస్ నటనను పూర్తి స్థాయిలో దర్శకుడు రాబట్టలేకపోయాడు. పోలీస్ ఆఫీసర్ పాత్ర అందరికీ నచ్చుతుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మెప్పించేలా ఉంటుంది. నటీనటులు అంతా బాగానే చేసినా వారి నుంచి సినిమాకు కావాల్సినంతగా పూర్తి స్థాయిలో నటనను సుజీత్ రాబట్టుకోలేకపోయాడు. హాలీవుడ్ సినిమాను తలపించేలా సన్నివేశాలు పెట్టారు. వీటిని ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ అందుకు తగ్గటుగా చూపించగలిగాడు. యాక్షన్‌తో కట్టిపడేసినా.. కథ మాత్రం పేలవంగా సాగుతుంది. మొత్తంగా ట్రైలర్ చూసి అంచనాలతో వెళితే మాత్రం నిరాశ తప్పదు. 

 

పంచ్ లైన్ :  యాక్షన్ అదిరింది.. కథ మాత్రం