అనుష్కతో పెళ్లి అవదు : ప్రభాస్ పెద్దమ్మ - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్కతో పెళ్లి అవదు : ప్రభాస్ పెద్దమ్మ

March 9, 2022

12

పాన్ ఇండియా స్టార్, బ్యాచిలర్ హీరో ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి స్పందించారు. ‘చాలా మంది అనుకున్నట్టు ప్రభాస్, అనుష్కల పెళ్లి అవ్వదు. వాళ్లు జస్ట్ ఫ్రెండ్స్ అంతే. పెళ్లి చేసుకునేంత ఫీలింగ్స్ వారిద్దరి మధ్య లేద’ని స్పష్టతనిచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడనీ, వాటి తర్వాత ఖచ్చితంగా వివాహం చేసుకుంటాడని వెల్లడించింది. అలాగే అమ్మాయి సినిమా రంగానికి చెందినదా? కాదా? అనేది త్వరలో తెలుస్తుంది, అప్పటి వరకు వేచి ఉండండంటూ సమాధానమిచ్చారు.  కాగా, శ్యామలా దేవి వ్యాఖ్యలతో ప్రభాస్ – అనుష్కల రిలేషన్‌పై ఇప్పటివరకు వచ్చిన వార్తలన్నీ రూమర్లేనని తేలిపోయింది. ఇక, ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఎల్లుండి థియేటర్లలో సందడి చేయనుంది.