అనుష్కతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ - MicTv.in - Telugu News
mictv telugu

అనుష్కతో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

August 21, 2019

Prabhas on dating rumours with Anushka Shetty ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సాహో ఈ నెల 30న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళం భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి విడుదల అవుతోంది. 

దీంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ఛానల్‌కు ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రిపోర్టర్ అనుష్కతో ఉన్న రిలేషన్ గురించి అడగ్గా..‘నాకూ లేదా అనుష్కకు..ఎవరికో ఒకరికి పెళ్లి అయితే తప్ప ఈ రూమర్స్ ఆగవు’ అని సమాధానం ఇచ్చాడు. అంతేకాదు అనుష్కను ఈసారి కలిసినప్పుడు ‘త్వరగా పెళ్లి చేసుకోమని అడుగుతానంటూ’ సరదాగా అన్నాడు. ఒకవేళ మేం ప్రేమలో ఉంటే ఎక్కడో చోట తిరిగేవాళ్ళమే కదా? ఎందుకు ఈ విషయాన్ని దాచిపెడతాం అని ప్రభాస్ తెలిపాడు. ప్రభాస్, అనుష్కలు పలు చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో వదంతులు వస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకొని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడటానికి ఇల్లు కూడా వెతుకుతున్నారని రూమర్స్ వచ్చాయి.