పద్మావతికి.. ప్రభాస్ కులానికి సంబంధమేంటి? - MicTv.in - Telugu News
mictv telugu

పద్మావతికి.. ప్రభాస్ కులానికి సంబంధమేంటి?

November 22, 2017

బాలీవుడ్ వివాదాస్పద చిత్రం ‘పద్మావతి’పై రగడ తలలకు వెలకట్టేదాకా పెరిగి తీవ్ర ఉద్రికత్తకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు, బీజేపీ, కర్ణిసేనలు తమకు అండగా ఉండాలని వివిధ పార్టీలను, సామాజిక వర్గాలను కోరుతున్నాయి. బాహుబలితో హిట్ కొట్టిన ప్రభాస్‌ను కూడా తమతో కలుపుకుని పోవాలని చూస్తున్నాయి.పద్మావతి క్షత్రియ మహిళ కనుక క్షత్రియుడైన ప్రభాస్.. ఆమె చరిత్రను వక్రీకరించి తీసిన ఈ మూవీని వ్యతిరేకించాలని కోరుతున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని ప్రభాస్ డిమాండ్ చేయాలంటూ ఆలిండియా క్షత్రియ మహాసభ కోరింది. ఒక క్షత్రియుడిగా ప్రభాస్ అభిప్రాయం చెబితే, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సంచలనం అవుతుందని ఈ సంఘం నేతలు కోరుతున్నారు.అయితే ఈ వివాదంలో జోక్యం చేసుకోవద్దని ప్రభాస్ నిర్ణయించుకున్నాడు. ఇది మనకు సంబంధం లేదని విషయం విషయమని, మౌనంగా ఉండడమే మేలని బాహుబలికి పెదనాన్న కృష్ణం రాజు సూచించినట్లు తెలుస్తోంది.