ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ బర్త్ డే స్పెషల్ గిఫ్ట్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్

October 23, 2020

nnfgn

ప్రభాస్ అభిమానులకు రాధే శ్యామ్ చిత్ర యూనిట్ సూపర్ గిఫ్ట్ అందించింది. రెబల్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేసింది. మధ్యాహ్నం 12.02 నిమిషాలకు ఓ పాటతో కూడిన మోషన్ పోస్టర్ వచ్చింది. రైలులో పూజా హెగ్డే తో ప్రభాస్ ప్రేమలో మునిగితేలుతున్నట్లుగా కనిపించే సీన్ విడుదల చేశారు. రైలు తలుపు నుంచి బయటకు వచ్చి చల్లటి గాలిని ఆశ్వాధిస్తున్నట్టుగా రూపొందించారు. బ్యాగ్రౌండ్‌లో  రాధ, కృష్ణులకు సంబంధించిన శ్లోకాన్ని చేర్చారు. 

రూ. 140 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ సంస్థ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ వేగంగా పనులు పూర్తి చేస్తోంది. దీనికి జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నాడు.