బాహుబలి షుక్రియా ! - MicTv.in - Telugu News
mictv telugu

బాహుబలి షుక్రియా !

July 11, 2017

హీరో ప్రభాస్ ఫేస్ బుక్ లో తనను అభిమానించి అక్కున చేర్చుకున్న ప్రేక్షకులందరికీ స్పెషల్ గా థాంక్స్ చెప్పాడు. ఒక ప్రాంతీయ భాషా హీరోగా వున్న నన్ను ఇలా అంతర్ఝాతీయ స్థాయిలో నిలబెట్టిన డైరెక్టర్ రాజమౌళికి, బాహుబలిని ఆదరించిన ప్రతీ ఒక్కరికి షుక్రియాలు చెప్పుకున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్ళు అహర్నిషలు కష్టపడి పని చేసి పూర్తి చేసాం. సెట్టులోని ప్రతిరోజు షూటింగ్ మరువలేనిది. రాజమౌళి బాగా ఎఫర్ట్ పెట్టి తీసాడు కాబట్టే నేను ఈ సినిమా ద్వారా ప్రపంచ స్థాయి ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ముఖ్యంగా ప్రేక్షకులు ఆదరించకపోయుంటే నేను లేను. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నానని.. తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టాడు ప్రభాస్.

https://www.facebook.com/ActorPrabhas/?ref=nf&hc_ref=NEWSFEED