18 కోట్ల డీల్‌కు "బాహుబాలి" నో...ఎందుకంటే... - MicTv.in - Telugu News
mictv telugu

18 కోట్ల డీల్‌కు "బాహుబాలి" నో…ఎందుకంటే…

May 15, 2017

బొమ్మ పడింది.స్టార్ డమ్ తిరిగింది.కేరీర్ గ్రాఫ్ బుల్లెట్ ట్రైన్ లా దూసుకెళ్లింది.టైమ్ అతని వెంటే తిరుగుతుంది. బట్ అతను మాత్రం పిక్చర్ పైనే నజర్.కోట్లు గీట్లు యాడ్లు జాన్తా నై అంటూ యాక్షన్ చేస్తున్నాడు. కాలం కలిసి వచ్చినప్పుడే ఎవరైనా రాళ్లు సంపాదించుకోవాలనుకుంటారు. అతను మాత్రం నో క్రోర్స్ ఓన్లీ రీల్ అంటున్నాడు వన్ అండ్ వన్లీ బాహుబాలి.

“బాహుబాలి” సిరీస్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేరీర్ గ్రాఫ్ ఎవరెస్ట్ ఎక్కేసింది. డైరెక్టర్లే కాదు ఆయన కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. తమ బ్రాండ్లకు ప్రభాస్‌తో ప్రచారం చేయిస్తే దూసుకుపోవచ్చని భావిస్తున్నాయి. . ప్రభాస్‌తో ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించాలని కోరారు. కానీ ప్రభాస్ మాత్రం ఏ ఒక్క డీల్‌కు ఇంతవరకూ ఓకే చెప్పలేదట. ఇప్పుడు కూడా అలాగే ప్రభాస్‌ను వెతుక్కుంటూ వచ్చిన 18 కోట్ల డీల్‌కు ప్రభాస్ నో చెప్పాడట. కొన్ని షూ కంపెనీలు, ఫిట్‌నెస్, ఎఫ్‌ఎమ్‌జీసీ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకునేందుకు సంప్రదించాయి.

ఈ డీల్స్ విలువ 18 కోట్ల పైమాటేనట. వీటన్నింటినీ ప్రభాస్ వదులుకున్నాడని టాక్. ప్రస్తుతం తను చేస్తున్న సాహో సినిమా పైనే ప్రభాస్ దృష్టి పెట్టాడని, ఆ సినిమా పూర్తయిన తర్వాతే ఏ డీల్ అయినా కుదుర్చుకునే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. యాడ్స్ కంటే సినిమాలే ముఖ్యమని ప్రభాస్ భావిస్తున్నాడట. పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడని కూడా సమాచారం. ఇలా రకరకాల కారణాల వల్ల కోట్ల రూపాయల డీల్స్‌ను ప్రభాస్ వదులుకుంటున్నట్లు సమాచారం.

HACK:

  • Prabhas rejects deal of Ads around 18 crores.
  • He has decided to focus on movies only.