బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు ప్రభాస్, అనుష్క. ఇద్దరూ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కావడంతో వీళ్ళ నడుమ లవ్ ట్రాక్ నడుస్తోందని, ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఓ రేంజ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అలా కూడా ప్రభాస్- అనుష్క జోడీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇకపోతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ జోడీని మరోసారి వెండితెరపై చూడాలని ప్రేక్షకలోకం కుతూహలంగా ఉంది. అయితే అందుకు ముహూర్తం సెట్ అవుతోందని, ఓ టాలెంటెడ్ దర్శకుడు వీరిని మరోసారి వెండితెరపై క్యూట్ లవర్స్ గా చూపించబోతున్నారనే టాక్ ఫిలిం నగర్లో నడుస్తోంది.
టాలెంటెడ్ దర్శకుడు మారుతి ఈ ఇద్దరినీ మరోసారి ఒకేతెరపై చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్‌తో మారుతి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో అనుష్కను భాగం చేయాలని ఆయన పక్కా ప్లాన్ చేశారట. ఈ మేరకు అనుష్కతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని టాక్.
రియల్ లైఫ్ ఈ పెయిర్ మంచి స్నేహితులు. ఫిల్మ్ ఈవెంట్స్‌లో, ఫంక్షన్లలోనూ చీయరఫుల్ గా హంగామా చేస్తుంటారు. అంతమందిలోనూ కబుర్లు చెప్పుకుంటూ.. నవ్వుకుంటూ.. మధ్య మధ్యలో కెమెరా కంటికి చిక్కారు. అయితే బాహుబలి ప్రమోషన్ ఇంటర్వ్యూలో అనుష్క తనకు తల్లిగా నటించాలని కోరుకుంటున్నా అంటూ ప్రభాస్ స్టేట్మెంట్ ఇచ్చి అనుష్కతో పాటు అందర్నీ షాక్ చేశారు. అయితే అప్పట్లో అందర్నీ షాక్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట మరో సారి వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడమే కాదు.. డార్లింగ్ మాటలు విన్న వారందరినీ.. మరోసారి నోరెళ్లబెట్టేలా చేస్తోంది.