రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లో ప్రభాస్ కూడా? - MicTv.in - Telugu News
mictv telugu

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’లో ప్రభాస్ కూడా?

April 14, 2019

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్‌’లో చిత్రంలో బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ కూడా న‌టించ‌బోతున్నాడ‌నే వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో స్వతంత్ర సమరయోధులైన అల్లూరి సీతారామ‌రాజు, కొమరం భీమ్ పాత్రలు ప్ర‌భాస్ వాయిస్‌ ఓవర్‌తోనే ప్రారంభం అవుతాయ‌ని ఒకవైపు ప్రచారం జరుగుతుండగా, మ‌రోవైపు ప్ర‌భాస్ ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

Prabhas To Come Up With Twin Surprises For His Fans? The Exciting Deets Inside!

ఒకే సినిమాలో ప్ర‌భాస్‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు క‌నిపిస్తే అభిమానుల ఆనందానికి హ‌ద్దులు ఉండవని అంటున్నారు. అలాగే ఇటీవల ఈ చిత్రం నుండి త‌ప్పుకున్న బ్రిటిష్‌ నటి డైసీ ఎడ్గార్‌జోన్స్ స్థానంలో నిత్యా మీన‌న్‌ను ఎంపిక చేశారనే ప్రచారం జ‌రుగుతుంది. మ‌రి ఈ వార్త‌ల‌పై స్పష్టత ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవ‌ల చ‌ర‌ణ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం వ‌ల‌న షూటింగ్ కాస్త బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే మొద‌లు కానున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటీన‌టులు అజ‌య్ దేవ‌గ‌ణ్, అలియా భ‌ట్ నటిస్తున్నారు. కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు.