అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తీయబోతున్న స్పిరిట్ చిత్రం నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి డార్లింగ్ ఫ్యాన్స్ ని తెగ ఖుషి చేస్తుంది. ఈ చిత్రం కల్ట్ కాప్ డ్రామాగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ” ప్రభాస్ కాప్ డ్రామా స్పిరిట్ ఇన్ సందీప్ రెడ్డి వంగ స్టైల్” అంటూ టి సిరీస్ అధినేత నిర్మాత భూషణ్ కుమార్ అధికారిక ప్రకటన చేశాడు. రెబల్ స్టార్, పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ఇప్పటి వరకు పోలీస్ పాత్రలో నటించలేదు. దాంతో ప్రభాస్ కెరీర్ లో తొలిసారి ఖాకీ చొక్కాతో రానున్నాడు. ‘సాహో’లో అండర్‌కవర్ పోలీస్ కింద కాసేపు కనిపించినా చివరికి అది నిజం కాదని తేలింది. దీంతో ప్రభాస్ కి ఇదే తొలి పోలీస్ స్టోరీ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుందని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు.
సందీప్ వంగా ప్రస్తుతం యానిమల్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉంటే.. ప్రభాస్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘సలార్’, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో ‘ఆదిపురుష్’ చిత్రాలని ఒకేసారి ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న అనిమల్ పూర్తవ్వగానే.. ప్రారంభమవుతుందని నిర్మాత వివరించారు. ఈ పోలీస్ డ్రామా చిత్రంలో ప్రభాస్ కొత్తగా కనిపించడం ఖాయమని చెప్పారు. ‘స్పిరిట్’ చిత్రానికి సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అని తెలిపారు నిర్మాత భూషణ్ కుమార్. ‘కబీర్ సింగ్’ సినిమా హిందీ రీమేక్‌తో ఉత్తరాది ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్‌ను క్రియేట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ ని పోలీస్ పాత్రలో ఎలా చూపెట్టనున్నాడన్న ఆసక్తి అభిమానుల్లో అప్పుడే టెన్షన్ పెట్టేస్తుంది.