పూజా హెగ్డే లుక్ విడుదల.. 'రాధేశ్యామ్'లో ప్రేరణ - MicTv.in - Telugu News
mictv telugu

పూజా హెగ్డే లుక్ విడుదల.. ‘రాధేశ్యామ్’లో ప్రేరణ

October 13, 2020

nhnf

ప్రభాస్, పూజా హెగ్డేలు ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈరోజు పూజ హెగ్డే పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రభాస్ ఆమె లుక్ ను విడుదల చేశాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే ‘ప్రేర‌ణ’ అనే పాత్ర‌లో నటిస్తోంది. ప్రభాస్ షేర్ చేసిన ఈ లుక్ లో ఆయన కూడా ఉన్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణకుమార్‌ తెరకెక్కిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌‌ బ్యానర్లపై వంశీ, ప్రసీద, ప్రమోద్‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఇటలీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.