బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె 2కి గెస్టుగా ప్రభాస్ హాజరైన ఎపిసోడ్ ఆహాలో రిలీజ్ అవ్వగా.. డార్లింగ్ దెబ్బకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రభాస్ లోని కామెడీ యాంగిల్ అత్యంత వినోదభరితంగా ఉండటంతో ఎపిసోడ్ కి భారీ బూస్ట్ వచ్చింది. డిసెంబర్30న సరిగ్గా అర్ధరాత్రి 12గంటలకు ఆహాలో ప్రభాస్ బాలయ్యల ఎపిసోడ్ విడుదలవ్వగానే ఆడియన్స్ పోటీపడి చూసేశారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ప్రభాస్ పెళ్లి టాపిక్ హైలైట్ అని చెప్పొచ్చు. గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పాలంటూ ప్రభాస్ ని బాలయ్య ఆడుకున్న తీరు సూపర్ అంటున్నారు. ప్రభాస్ తన గర్ల్ ఫ్రెండ్ పేరు ఎంతకీ చెప్పకపోవడంతో బాలయ్య రామ్ చరణ్ కి కాల్ చేసి గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పాలని అడగటంతో షో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.
ఇక ఏజ్ పెరిగిపోతున్న ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అని అడిగితే నాకు రాసిపెట్టి లేదేమో సార్ అని ప్రభాస్ చెప్పడంతో మీ అమ్మకు చెప్పే సమాధానాలు నాకు చెప్పద్దు అంటూ ప్రభాస్ కి కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా నవ్వేశారు. ఇక రామ్ చరణ్ కి కాల్ చేసి ప్రభాస్ గురించి ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పమని అడుగుతే.. ఏం చెప్పమంటారు అని బాలయ్యకి ఎదురుప్రశ్న వేస్తాడు చెర్రీ. దాంతో ప్రభాస్ ఇప్పుడు ఎవరితో రిలేషన్ లో ఉన్నాడో చెప్పాలని అడుగుతాడు. మాకు ఒక బ్రో కోడ్ ఉంది. దాన్ని బ్రేక్ చేయలేను. సారి బాలయ్యగారు అని చరణ్ బదులిస్తూ.. బ్రో కోడ్లు మనదెగ్గర నడవవమ్మా.. ప్రస్తుతం ఏ అమ్మాయితో ప్రభాస్ డేటింగ్ చేస్తున్నాడు? రాజులా? రెడ్లా? నాయుడులా? చౌదరులా? సనన్‌ఆ లేదా శెట్టిలా అని నువ్వు చెప్పాల్సిందే అని బాలయ్య బలవంతం చేయగా ప్రభాస్ త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అని రాంచరణ్ చెప్పడంతో బాలకృష్ణ ప్రభాస్ ని కాసేపు ఆడుకున్నారు.
ఇవి కూడా చదవండి :
స్టార్ కమెడియన్‌పై యాంకర్ రష్మీ ఆగ్రహం..!
22ఏళ్ళ తరువాత మరో సంచలనం.. మెగా మాస్ సాంగ్ పూనకాలు రిలీజ్..!
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా…..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం