ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే జరుగుతుంది: జ్యోతిషుడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ పెళ్లి ఈ ఏడాదే జరుగుతుంది: జ్యోతిషుడు

March 8, 2022

టాలీవుడ్‌ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని కొన్ని రోజులుగా ఇటు ఇండస్ట్రీలో అటు అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ మధ్య కాలంలో ప్రభాస్ పెళ్లి గురించి పదే పదే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆయన తాజాగా నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఎక్కడికెళ్లిన మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఆయన అభిమానులు ప్రభాస్‌ను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిషుడు ఆచార్య వినోద్ కుమార్ మాత్రం ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాడని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.”ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబరు 2022 నుంచి అక్టోబరు 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. ఇది పాన్ ఇండియా స్టార్ విషయంలో నా జ్యోతిష్యం” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్నా విషయం తెలిసిందే. ఆయన చేస్తున్న సినిమాల బడ్జెట్ కలిపితే దాదాపు రూ.1000 కోట్లకు పైమాటే. అలాంటి స్టార్ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు
అవుతుందా? అని ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్లకు చెప్పినట్లు గతంలో ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆయన పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది.

మరోపక్క ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆయన హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించనున్నారు. పూజా హెగ్డ్ కథానాయిక. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించారు. వీటితో పాటు ప్రభాస్ ‘సలార్’, ‘ఆది పురుష్’, ‘ప్రాజెక్టు కె’ చిత్రాలతో పాటు మరో చిన్న సినిమాలోనూ నటించనున్నారు.