అభిమాని కుటుంబానికి సహాయం చేసిన ప్రభాస్ - MicTv.in - Telugu News
mictv telugu

అభిమాని కుటుంబానికి సహాయం చేసిన ప్రభాస్

March 15, 2022

p

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్ ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కారంపూడిలో చల్లా పెదకోటి అనే అభిమాని సినిమా బ్యానర్లు కడుతూ పొరపాటున కరెంట్ షాక్ తగిలి మరణించాడు. అనంతరం మండల అభిమాన సంఘ నాయకుడు చల్లా అనిల్ ఈ విషయాన్ని హీరో ప్రభాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభాస్ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాజాగా ఆ చెక్కును మ‌ృతుడి భార్య చల్లా పిచ్చమ్మకు అందించారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రాధేశ్యామ్ నాలుగు రోజుల్లో రూ. 151 కోట్లను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. డివైడ్ టాక్ వచ్చినా విదేశాల్లో మంచి కలెక్షన్లను రాబడుతోందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.