ప్రభాస్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ దర్శకుడితో కొత్త సినిమా! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రభాస్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ దర్శకుడితో కొత్త సినిమా!

February 26, 2020

nvnvn

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహా నటి సినిమా తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఈ సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది బడా హీరోలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఇతనితో హీరో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌కు చాలా మంది కథలను వినిపించడగా నాగ్ అశ్విన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయనే కథనాలు వినిపిస్తున్నాయి. 

చాలా రోజులుగా నాగ్ అశ్విన్ ఒక కథపై కసరత్తు చేస్తూ వస్తున్నాడట. ఇటీవల ఆయన ఆ కథను ప్రభాస్‌కు వినిపించాడట. దీనికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాజాగా స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. దీంతో త్వరలోనే వీరి కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు సినిమా రానుంది. 

సాహో తర్వాత మంచి హిట్ కోసం చూస్తున్న ప్రభాస్‌ ఇప్పటికే దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ‘రాధే శ్యామ్’ అనే రొమాంటిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీరి సినిమా ఎప్పటిలోగా సెట్స్ పైకి వెళ్తుందనేది తేలాల్సి ఉంది.