ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరల విషయంలో గతకొన్ని రోజుల క్రితం సినీ పెద్ధలు చిరంజీవి, మహేశ్, ప్రభాష్, రాజామౌళి, కొరటాల శివ తదితరులు జగన్ మోహన్ రెడ్డిని కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ అనుకూలంగా స్పందించాడు అని, త్వరలోనే టికెట్ల ధరల విషయంలో శుభం కార్డ్ పడినట్లే అని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి లేదా మంగళవారం ఉదయం కల్లా జీవోను జారీ చేయడానికి జగన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తుందని సమాచారం. ఈ సందర్భంగా మూవీ టికెట్ ధరలపై ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో హీరో ప్రభాస్ స్పందించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ”రాధేశ్యామ్ విడుదలకు ముందే టికెట్ ధరలపై ప్రభుత్వం జీవో ఇస్తే చాలా సంతోషిస్తా. నేనే కాదు మా బృందం కూడా ఎంతో సంతోషిస్తుంది” అని అన్నారు. తాజాగా పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదలకు ముందే ఏపీలో టికెట్ ధరలు పెరుగుతాయని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. అంతేకాకుండా తమ అభిమాన హీరో సినిమాకు ఐదోవ షోకు అనుమతి ఇవ్వాలని అభిమానులు ప్రభుత్వాని కోరగా.. తిరస్కరించింది. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు విజయవాడలో ధర్నాలు, నిరసనలు చెపట్టిన విషయం తెలిసిందే.