Home > Featured > రష్యాలో ఇరగదీస్తున్న బాహుబలి-2..ఇదిగో సాక్ష్యం!

రష్యాలో ఇరగదీస్తున్న బాహుబలి-2..ఇదిగో సాక్ష్యం!

Prabhas's Baahubali 2 airs on TV in Russia.jp

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి సినిమా‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్ లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా ప్రపంచంలోని అనేక దేశాల్లో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా రష్యాలో తన ప్రభావాన్ని చూపుతోంది. రష్యన్‌ వాయిస్‌ఓవర్‌తో డబ్బింగ్‌ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో ప్రసారమవుతూ రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా సినిమాలోని ఒక ​సన్నివేశాన్ని రష్యాలోని భారతీయ రాయబార సంస్థ‌ తమ ఫేస్ బుక్ పేజీలో షేర్‌ చేసింది. 'ఒక ఇండియన్‌ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బాహుబలి 2 సినిమా రష్యన్‌ వాయిస్‌ ఓవర్‌లో టీవీల్లో ప్లే అవుతుంది.' అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated : 28 May 2020 6:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top