సాహో ప్రభాస్ ! - MicTv.in - Telugu News
mictv telugu

సాహో ప్రభాస్ !

July 3, 2017

‘ బాహుబలి ’ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడనే విషయం మీద చాలా మంది అభిమానులకు కుతూహళంగా వుండేది. సుజీత్ కు ముందే ఫిక్స్ అవడం వల్ల ‘ సాహో ’ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ప్రభుదేవా దర్శకత్వంలో ఓ సినిమా చేసే ఆలోచనలో వున్నాడు ప్రభాస్. వీరిద్దరూ కలిసి గతంలో ‘ పౌర్ణమి ’ సినిమా చేసారు. అలాగే హిందీలో ప్రభుదేవానే రూపొందించిన ‘ యాక్షన్ జాక్సన్ ’ సినిమాలో గెస్ట్ రోల్ చేసాడు ప్రభాస్. ఇప్పడు మళ్ళీ చాలా రోజుల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ కుదరనుందన్నమాట.

చూడాలి మరి ప్రభాస్ కెరియర్ కు ప్రభుదేవా బూస్ట్ ఎలా ఇస్తాడో. హిట్టైనవాళ్ళను అందరూ ఎదురెళ్ళి మరీ అలుముకుంటారు. ఫట్టైన హీరోలను ఎవ్వరూ పట్టించుకోరు. ప్రభాస్ ఇప్పుడు నేషనల్ ఫిగర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడతని వెంట చాలా మంది డైరెక్టర్లు క్యూలు కట్టడం సహజమే !