రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తా.. - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేస్తా..

August 23, 2017

వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రాజీనామాకు సిద్ధమయ్యారు. ‘ప్రమాదాలకు నైతిక బాధ్యత నాదే’ అని ఆయన ట్వీట్ చేశారు. రాజీనామా చేస్తానంటూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. అయితే కొంత కాలం వేచి చూడాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.

‘మూడేళ్లుగా రైల్వే అభివృద్ధి కోసం చెమటోడ్చి పనిచేశాను. కానీ ఈ ప్రమాదాలు నన్ను తీవ్ర బాధకు గురిచేశాయి. ప్రమాదాల్లో అమాయకులు చనిపోవడం, గాయపడడం నన్ను కలచివేసింది. అందుకే రాజీనామాకు సిద్ధమయ్యా. అయితే ప్రధాని మోదీ కొంతకాలం వేచి చూడాలని కోరారు..’’ అని రైల్వే మంత్రి బుధవారం ట్వీట్ చేశారు.

బుధవారం ఆరియారాలో కైఫియత్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఉత్కళ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పడంతో 23 మంది చనిపోయారు. రైల్వే ఆధునీకరణ కోసం ప్రభుత్వం కోట్ల కొద్దీ ఖర్చు చేస్తున్నా, భద్రత కోసం పలు చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.