ఆరోగ్యంగానే ఉన్నాను..పుకార్లను నమ్మకండి..ప్రదీప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆరోగ్యంగానే ఉన్నాను..పుకార్లను నమ్మకండి..ప్రదీప్

November 8, 2019

ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఆరోగ్య పరిస్థితిపై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెల్సిందే. ప్రదీప్ టెలివిజన్ రంగానికి దూరమైపోయాడంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ రూమర్లపై  ప్రదీప్ స్పందించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ వీడియో చేసి తన అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండించాడు. ‘షూటింగ్‌లో నా కాలికి గాయమైనది. డాక్టర్లు నిల్చోవద్దని చెప్పారు. అందుకే విశ్రాంతి తీసుకున్నా. మళ్లీ ఓ వారంలో షూటింగ్‌లో పాల్గొంటాను’ అని తెలిపాడు. 

 

తన 10 సంవత్సరాల కెరీర్‌లో ఇప్పటివరకూ ఇన్ని రోజుల విశ్రాంతి ఎప్పుడూ తీసుకోలేదన్నాడు. నెల రోజుల పాటు షూటింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపాడు. చాలా రోజుల తర్వాత దీపావళి, తన పుట్టిన రోజును కుటుంబంతో కలిసి ఎంజయ్ చేశానని సంతోషం వ్యక్తం చేశాడు. ‘నెలరోజులు విశ్రాంతి అంటే బోర్‌ కొడుతుందనుకున్నా కానీ యూట్యూబ్‌ వీడియోలు, వాటి థంబ్ నెయిల్స్ చూసి చాలా టైమ్‌పాస్‌ అయింది. క్షీణించిన ఆరోగ్యం, దిగ్భ్రాంతిలో ఇండస్ట్రీ అంటూ క్రేజీ హెడ్ లైన్స్ ఉన్న వీడియోలను చూసి బాగా నవ్వుకునేవాడిని. కానీ తెలీనివాళ్లు కంగారుపడిపోతారు కదా. అందుకని కాస్త నిజానిజాలు తెలుసుకొని చెప్పండి’ అని హితవు పలికాడు.