ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. పీపీఈ కిట్లేసుకుని ముట్టడి - MicTv.in - Telugu News
mictv telugu

ప్రగతి భవన్ వద్ద టెన్షన్.. పీపీఈ కిట్లేసుకుని ముట్టడి

August 12, 2020

Pragati bhavan incident

ప్రగతి భవన్ వద్ద ఈరోజు ఉదయం టెన్షన్ వాతావరణం నెలగొంది. ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. వెంటనే అప్రమతమైన పోలీసులు 20 మంది ఎన్.ఎస్.యు.ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. 

తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకంగా ఈ ముట్టడి జరిగింది. హైకోర్టు పిటీషన్ పెండింగ్ ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ‘రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం టెస్టులు పెంచడం లేదు.

కానీ, హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పటికీ అనాలోచితంగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. వెంటనే పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులందరిని ప్రమోట్ చెయ్యాలి. కరోనా ఉధృతిని అరికట్టడానికి కరోనా టెస్టులను పెంచాలలి.’ ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.