మాట తెచ్చిన చేటు..రక్షణ శాఖ కమిటీ నుంచి ప్రగ్యా సింగ్ ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

మాట తెచ్చిన చేటు..రక్షణ శాఖ కమిటీ నుంచి ప్రగ్యా సింగ్ ఔట్

November 28, 2019

నోరుజారితే తిరిగి తీసుకోలేమని పెద్దలు చెప్పే మాట. అందుకే ఏం మాట్లాడినా విచక్షణగా మాట్లాడాలని అంటారు. లేకపోతే ఆ మాట చేటు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఇది వివాదస్పద ఎంపీ  ఎంపీ ప్రగ్యా సింగ్ విషయంలో మరోసారి రుజువైంది. ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా రక్షణ రంగ కమిటీతో పాటు పార్లమెంట్ క్రమశిక్షణ కమిటీ నుంచి ఆమెనున తొలగించారు. ఇటీవల ఆమెకు రక్షణశాఖ కమిటీలో మెంబర్‌గా తీసుకోగా వెంటనే తొలగించడం విశేషం. 

ఆమె చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమని బీజేపీ పెద్దలు వెల్లడించారు. గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడంటూ ఈ వివాదాస్పద ఎంపీ ప్రగ్యా సింగ్ మరోసారి ఏకంగా లోక్‌సభలో కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటువంటి సిద్ధాంతాలకు తాము వ్యతిరేకమని, ఆమె సొంత అభిప్రాయం మాత్రమేనని తెలిపారు. ఈ మాటల నేపథ్యంలో ఆమెను కీలక పదవుల నుంచి తప్పించారు. ప్రగ్యా సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా గతంలోనూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో ప్రధాని మోదీ ఆదేశాలతో కొంత కాలం వివాదాలకు దూరంగా ఉన్న ఆమె మరోసారి నోటికి పనిచెప్పారు.