గాడ్సే దేశభక్తుడు కాడు.. సారీ చెప్పిన ప్రజ్ఞాసింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

గాడ్సే దేశభక్తుడు కాడు.. సారీ చెప్పిన ప్రజ్ఞాసింగ్

May 16, 2019

మహాత్మా గాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సే దేశభక్తుడన్న బీజేపీ భోపాల్‌ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ వెనక్కు తగ్గారు. తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. బీజేపీ సైతం ఖండించింది. ఆమె బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పలువురు నేతలు ట్వీట్లు చేశారు. కాంగ్రెస్‌ నేత, భోపాల్‌ బీజేపీ అభ్యర్ధి దిగ్విజయ్‌ సింగ్‌, ఆ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా కూడా సాధ్వి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

Pragya Thakur hails Nathuram Godse apology

దీంతో గాంధీని చంపిన గాడ్సే ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని వివరణ ఇచ్చారామె. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ఆమె క్షమాపణ కోరారు. తన వ్యాఖ్యలపై ప్రజ్ఞా క్షమాపణలు చెప్పారని ఆమె ప్రతినిధి, బీజేపీ నేత హితేష్‌ వాజ్‌పేయి తెలిపారు.