Praja Shanti Party President KA Paul has predicted which party will win the munugode by-elections.
mictv telugu

మునుగోడులో గెలిచేది బీజేపీనే.. కేఏ పాల్

August 12, 2022

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. ఈ మధ్య రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ జనాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏంటో జోస్యం చెప్పారు కేఏ పాల్. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా గెలిచేది లేదన్నారు. విజయం మాత్రం బీజేపీదేనని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితంలో గెలుపు సాధించేది బీజేపీ పార్టీయేనని..ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ నుంచి సగం మంది బీజేపీలో జాయిన్ అవుతారని కేఏ పాల్ అంచనా వేశారు.  ఈ నెల 19,20 తేదీల్లో మునుగోడులో పర్యటిస్తానని తెలిపారు. ఉప ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను కలవాలని యత్నించినా కొంతమంది టీఆర్ఎస్ నేతలు కలవనివ్వలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రాజకీయంగా ఇంకా అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాజకీయంగా కేటీఆర్ ఇంకా పరిపక్వత చెందలేదన్నారు.