ప్రజాపంథా అసెంబ్లీ ముట్టడి.. నేతల అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

ప్రజాపంథా అసెంబ్లీ ముట్టడి.. నేతల అరెస్ట్

March 14, 2022

000

పలు ప్రజాసమస్యల పరిష్కారం కోసం సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. పార్టీ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు అసెంబ్లీ వైపు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. 57 ఏళ్లు నిండిన అందరికీ పెన్షన్ ఇవ్వాలని, రేషన్ కార్డులు లేని వారందరికీ వాటిని ఇవ్వాలని, దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్నా వారందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రజాపంథా డిమాండ్ చేసింది. న్యాయమైన ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయం, అప్రజాస్వామికమని మండిపడింది. అలాగే సొంత స్థలం ఉన్న వారందరికీ 5 లక్షల రూపాయలు ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని కోరుతూ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. కార్యకర్తలు అసెంబ్లీవైపు వెళ్తుండగా పోలీసులు లాఠీ చార్జి చేసి పలువురి అరెస్ట్ చేశారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, అంబర్‌పేట్, మలక్‌పేట్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో పార్టీ నేతలు వి. ప్రభాకర్, రంగారావు, చంద్రశేఖర్, సత్య, సుధాకర్, రామన్న తదితరులు ఉన్నారు.