కేఏ పాల్‌పై దాడి... పరామర్శకు వెళ్తుండగా.. - MicTv.in - Telugu News
mictv telugu

కేఏ పాల్‌పై దాడి… పరామర్శకు వెళ్తుండగా..

May 2, 2022

టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, కేటీఆర్‌లను తీవ్రంగా విమర్శిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి రైతులను పరామర్శించడానికి వెళ్లిన ఆయనపై టీఆర్ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న వ్యక్తులు దాడి చేశారు. తనను చంపడానికే టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి వచ్చారని పాల్ ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల్లో పంటలు కోల్పోయిన రైతులను పరామర్శించడానికి పాల్ ఆ గ్రామానికి వెళ్లారు. మొదట సిద్దిపేట జిల్లా ఒక్కపూర్ వద్ద పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పొలీసులతో వాగ్వాదం సాగుతుండగా అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు పాల్‌ను కొట్టారు. తర్వాత పోలీసులు ఆయనను హైదరాబాద్‌కు పంపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కేసీఆర్‌ను గద్దె దింపుతానని పాల్ ఇటీవల అంటున్న విషయం తెలిసిందే.