పాల్‌కు  50.. సీట్లు కాదు, ఓట్లు - MicTv.in - Telugu News
mictv telugu

పాల్‌కు  50.. సీట్లు కాదు, ఓట్లు

May 23, 2019

‘మార్చిలో మహా మార్పులు, ఏప్రిల్‌లో సునామీ.. 150 సీట్లు మావే.. ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవు. నేను గెలిస్తే ఏపీని అమెరికా.. నరసాపురాన్ని నార్త్ అమెరికా చేస్తా..’ ఈ మాటలు వింటుంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన ఈ ఎన్నికల్లో జనాలకు కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందించారని సోషల్ మీడియాలో చాలామంది ట్రోల్ చేశారు. ఇప్పటివరకు సాగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు 50 ఓట్లు మాత్రమే  దక్కాయి.

prajashanti party leader KA Paul gets  50 votes in narsapuram assembly elections

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా కేఏ పాల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అదే నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు, వైసీపీ నుంచి రాఘరామక్రిష్ణంరాజులు పోటీలో ఉన్నారు.

ఈ క్రమంలో ఆయన నిన్న ఢిల్లీలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జరిగిన ఎన్నికలు అవినీతితో కూడిన ఎన్నికలంటూ ధ్వజమెత్తారు. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమైతే ఈవీఎంలలో అక్రమాలు జరిగినట్లేనని అన్నారు. ఎన్నికల నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉన్నందున ఈ ఎన్నికలను బహిష్కరించాలని తానే తొలుత సూచించానని అన్నారు. ఇందుకోసం కలిసి పోరాడాలని మాయావతి, మమతా, అఖిలేశ్‌ తదితరులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. చంద్రబాబు కూడా తన మాటలు పట్టించుకోలేదని, తన దాకా వచ్చేసరికి ఇప్పుడు పోరాటం చేస్తున్నారని ఆరోపించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనమేంటని పాల్‌ ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు దాటే పరిస్థితి లేదన్నారు. మమత, అఖిలేశ్‌, మాయావతి వంటి నేతలు ఈ ఎన్నికల్లో కీలకమవుతారని పాల్‌ అన్నారు.