బండి సంజయ్‌కి తెలంగాణ ఇష్టం లేకపోతే అక్కడికి పోవాలి.. కేఏ పాల్ - MicTv.in - Telugu News
mictv telugu

బండి సంజయ్‌కి తెలంగాణ ఇష్టం లేకపోతే అక్కడికి పోవాలి.. కేఏ పాల్

May 26, 2022

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌… బుధవారం హైదరాబాద్ లో జరిగిన హనుమాన్ శోభాయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఉన్న మసీదులన్నీ తవ్వాలని.. అలా చేస్తే.. శివలింగం వస్తే మాది.. శవమైతే మీరు తీసుకోండి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు.

మతాల మధ్య చిచ్చుపెట్టాలని బండి సంజయ్‌ చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఉండడం ఇష్టం లేకపోతే యూపీకి వెళ్లి ఉండాలని హితవు పలికారు. జూన్‌లో తెలంగాణ అమరవీరుల సంతాప సభలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అటు ఏపీలో కూడా త్వరలో పర్యటిస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు.