అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి..విహారయాత్రకని వెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి..విహారయాత్రకని వెళ్లి..

October 4, 2019

అమెరికాలోని డల్లాస్‌లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబంతో హాలిడే ట్రిప్ కోసం వెళ్లిన ప్రవాసాంధ్రుడు సురేష్ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి దుర్మరణం పాలయ్యాడు. సురేష్ డల్లాస్‌లోని సింతెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అక్కడే స్థిరపడ్డారు. కుటుంబంతో ఒక్లహోమాలోని టర్నర్ జలపాతం చూడటానికి వెళ్లారు.

Prakasam man suresh..

సురేశ్ మృతితో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతదేహానికి స్వస్థలంలో అంత్యక్రియలు జరపాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కానీ, మృతదేహం తరలింపుకు దాదాపు 80 వేల డాలర్లు ఖర్చు కానుండటంతో ఆందోళన చెందుతున్నారు. రెస్క్యూ టీం జలపాతం నుంచి సురేశ్ మృతదేహాన్ని వెలికితీసి సమీపంలోని ఆస్పత్రికి భద్రపరిచింది. కుటుంబసభ్యులు, బంధువుల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఫండ్ రైజింగ్ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే కొంత మంది తమకు తోచిన సహాయం అందించారని తెలిపారు. అమెరికాలో తెలుగు సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని వీలైనంత త్వరగా సురేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.