Prakash Raj Calls ‘The Kashmir Files’ A Nonsense Film
mictv telugu

‘ది కశ్మీర్ ఫైల్స్’పై అంతర్జాతీయ జ్యూరీయే ఉమ్మేసింది..

February 8, 2023

Prakash Raj Calls ‘The Kashmir Files’ A Nonsense Film

‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా వచ్చి ఏడాది గడుస్తున్నా దానిపై వివాదాలు మాత్రం ఆగట్లేదు. గోవాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా చైర్మన్ నడవ్ లపిడ్ ఈ సినిమాను చెత్త సినిమాగా అభివర్ణించిన సంగతి తెలిసిందే..తాజాగా ఈ చిత్రంపై మరోసారి ప్రకాశ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. అది ఓ నాన్సెన్స్ ఫిల్మ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేరళలో జరిగిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్‌లో ఆయన మాట్లాడారు.

కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు అగ్నిహోత్రిపై కూడా ప్రకాశ్ రాజ్ తన అక్కసును వెళ్లగక్కాడు. అంతర్జాతీయ జ్యూరీయే వారిపై ఉమ్మేసిందని విమర్శించాడు. అయినా సిగ్గులేకుండా దర్శకుడు ఆస్కార్ ఎందుకు రాదు.? అని అడిగారంటూ ఫైరయ్యాడు. ఆ సినిమాకు కనీసం భాస్కర్ అవార్డు కూడా రాదని ఎద్దేవ చేశాడు. ఇలాంటి వారు కేవలంల మొరగాడానికే మాత్రమే పనికొస్తారుగానీ..కాటువేసే దమ్ము లేదన్నారు. షారూఖ్ నటించిన పఠాన్ చిత్రంపై మాత్రం ప్రకాశ్ రాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాలీవుడ్ బాయ్ కాట్ అన్నవారికి పఠాన్ చిత్రం సమాధాన మిచ్చిందని వెల్లడించాడు. ఏకంగా రూ. 700 కోట్లు రాబట్టి సత్తా చాటిందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

నన్ను పాన్ ఇండియా స్టార్ అనకండి-విజయ్ సేతుపతి

జగిత్యాలలో నాపై కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి