prakash raj condums comments on bjp going viral in social media
mictv telugu

బీజేపీలో ప్రకాశ్ రాజ్ ‘కండోమ్స్’ కామెంట్స్ కలకలం.. కక్కలేక మింగలేకపోతున్న కమలాలు

October 30, 2022

టీఆర్ఎస్ ఎమ్యెల్యేల కొనుగోలు దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఆశ్రమంలో పూజలు చేసుకునే స్వామిజీలను బ్రోకర్లుగా బీజేపీ మార్చిందని దేశంలోని వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఫార్మ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్యెల్యేలతో బేరసారాలు చేస్తూ పోలీసులకి దొరికిపోయి న వైనంపై ఆప్, జనతాదళ్ , కర్నాటక కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ తన అభిప్రాయాన్ని తెలిపారు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ మోనార్క్ గా ముద్రపడ్డ ప్రకాష్ రాజ్, ఎమ్యెల్యేల కొనుగోలు ఇష్యూపై హాట్ కామెంట్స్ చేశాడు. బీజేపీలో చేరండి.. ఈడీ, ఐటీ దాడుల నుండి కాపాడుతాం అని స్వామీజీలు అన్నట్టుగా ఉన్న ఆడియోలతో దేశంలో బీజేపీ నేతలు పొలిటికల్ కండోమ్స్ అమ్ముతున్న విషయం స్పష్టమైందన్నారు ప్రకాశ్ రాజ్.

టీఆర్ఎస్ ఎమ్యెల్యేల కొనుగోలు పై తన సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రాల్లో అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటే. అన్ని రాష్ట్రాల్లో ఈ పనులు చేస్తూ.. ప్రభుత్వాలని కూలుస్తు వస్తుంది. ఇక్కడ తెలంగాణలోను అదే చేయాలనీ చూసింది, చేస్తుంది. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గుర్తించాలి. ఇలాంటి పనులు ఎవరు చేసినా ప్రశ్నించాలి’ అని ప్రకాష్ రాజ్ ప్రజలకు సూచించారు. ఇక్కడితో ఆగకుండా ఘాటైన పదాలతోను బీజేపీపై విరుచుకుపడ్డారు. జస్ట్ ఆస్కింగ్ ట్యాగ్‌తో.. వాళ్లు పొలిటికల్ సేఫ్టీ కండోమ్స్ అమ్ముతున్నారా.. అనే ప్రశ్నను సంధించారు ప్రకాష్ రాజ్. బీజేపీలో చేరిన టీఆర్ఎస్ ఎమ్యెల్యేలపై ఈడీ, ఐటి దాడులు జరుగకుండా చూస్తాం అని స్వామీజి చెప్పిన ఆడియో క్లిప్ పై స్పందించాలని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి ప్రకాశ్ జవాబిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ కండోమ్స్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీజేపీ శ్రేణులు ప్రకాశ్ రాజ్ కామెంట్స్ ని ఎలా తిప్పికొట్టాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ ప్రతినిధులుగా తమని తాము చెప్పుకున్న స్వామీజీల బేరసారాలు బయటపడ్డాకా.. ప్రకాశ్ రాజ్ కామెంట్స్ ని ఖండించలేకపోతున్నాయి బీజేపీ వర్గాలు.