ఒక రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రకాశ్ రాజ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒక రూపాయి కోసం కోర్టుకెక్కిన ప్రకాశ్ రాజ్

February 28, 2018

పరువు నష్టం దావాలు కోట్లలోనే ఉంటాయి. తమ ప్రతిష్ట అంతా ఇంతా అని సెలబ్రిటీలు కోర్టుల గడప తొక్కుతుంటారు. అయితే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం కేవలం ఒకే ఒక రూపాయి కోసం పరువు నష్టం దావా వేశారు.  మైసూరు–కొడుగు ఎంపీ ప్రతాప్‌ సింహ తను పరువుకు భంగం కలిగించారని ఆయన నుంచి తనకు రూపాయిని నష్టపరిహారంగా ఇప్పించాలని మైసూరు కోర్టును కోరాడు.ప్రతాప్‌ సింహ ఎంపీగా ఒక పెద్ద పదవిలో ఉన్నారని, అయితే సోషల్‌ మీడియాలో తనను బండబూతులు తిడుతున్నారని ప్రకాశ్ ఆరోపించారు. ‘ప్రతాప్‌ సింహ ప్రజానాయకుడు కాదు. ఓ గూండా.  నేను మోదీపై కర్ణాటకకు సంబంధించిన పలు విషయాలు మీడియా ద్వారా ప్రశ్నించాను. సింహకు దమ్ముధైర్యం ఉంటే జవాబు ఇవ్వాలి. కానీ ఆయ అందుకు బదులుగా నాపై అసభ్య వ్యాఖ్యలు చేశాడు… నా కుమారుడు చనిపోయినప్పుడు నేను ఒక డ్యాన్సర్‌తో ఉన్నట్టు పోస్టు పెట్టాడు.. నాకు మోదీ గురించి మాట్లాడే అర్హత లేదన్నాడు..’ అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.

సింహ వ్యాఖ్యలతో తన పరువుకు భంగం కలిగడమే కాక, తాను మానసికంగా బాధపడ్డానని వాపోయాడు. అయితే సింహపై తనకు వ్యక్తిగత కోపం లేదనీ అన్నాడు. సోషల్‌ మీడియాను స్వార్థం కోసం వాడుకుని, జనాన్ని తప్పుదారి పట్టించినందుకు ఆయన తనకు ఒక్క రూపాయి ఇవ్వాలని కోరాడు.